![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఆగస్టు 15 ని పురస్కరించుకుని మంచి స్కిట్స్ తో సాంగ్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఈ షో స్టార్టింగ్ లో ఆటో రాంప్రసాద్, నాటీ నరేష్, మానస్ డాన్స్ చేస్తూ వచ్చారు. రాంప్రసాద్ వస్తూనే యూట్యూబర్స్ మీద కామెంట్స్ చేసాడు. రీసెంట్ గా "భోళా శంకర్" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది యూట్యూబర్స్ అంతా కష్టపడాలని ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేయొద్దని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాంప్రసాద్ ఆదిని ఫాలో ఐనట్టు కనిపిస్తోంది.
"అరేయ్ నరేష్ నాకు చాలా బాధగా ఉంది" అని రాంప్రసాద్ అనేసరికి "ఎందుకన్నా" అని అడిగాడు నరేష్. "ఈ యూట్యూబ్ వాళ్ళు నాకు కాన్సర్ లేకపోయినా కాన్సర్ ఉందని రాస్తున్నారు" అనేసరికి మానస్ ఎంట్రీ ఇచ్చి "అవును భయ్యా..నాకు 100 కోట్లు లేకపోయినా ఉన్నట్టుగా రాస్తున్నారు" అని చెప్పాడు. "ఈ యూట్యూబ్ వాళ్ళు లేనిది ఉన్నట్టు రాస్తున్నార్రా" అని రాంప్రసాద్ యూట్యూబర్స్ మీద కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటే నాటీ నరేష్ మాత్రం హ్యాపీ ఫేస్ తో "వాళ్ళ నంబర్ నాకు ఇవ్వన్నా..కొద్దిగా నాకు అవసరాలు ఉన్నాయి.. నేను లేనిది ఉన్నట్టుగా వేయించుకోవాలి" అని చెప్పి అక్కడ ఫన్ క్రియేట్ చేసి అందరినీ నవ్వించాడు.
![]() |
![]() |